సుభాష్ పాలేకర్ 1949లో మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించారు. నాగ్‌పుర్‌లో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసిన ఆయన కాలేజీ రోజుల్లోనే.. ఆదివాసీ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. 1972లో తన తండ్రితో కలిసి పురాతన వ్యవసాయ పద్ధతిని ప్రారంభించారు.
పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై పాలేకర్ దేశ వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మరాఠీ, కన్నడ, తమిళ భాషల్లో పుస్తకాల్ని ప్రచురించారు. శిక్షణ శిబిరాలు, సదస్సులు నిర్వహించి రైతాంగంలో అవగాహన కల్పించారు. 1996నుంచి 98 వరకు బలి రాజా అనే మరాఠీ వ్యవసాయ పత్రిక సంపాదక సభ్యుడిగా చేశారు. దాదాపు 20 మరాఠీ, 4 ఇంగ్లిష్, 3 హిందీ పుస్తకాలను రాశారు. ఆయన రచనలు దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి తర్జుమా చేశారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు, మేధావులను వ్యవసాయ రంగంలో అసలైన సమస్యలను గురించి ఆలోచింపజేస్తున్నారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ విధానం రైతులకు ఎంతో ఉపకరిస్తుందనేది పాలేకర్ వాదన. విషరహిత ఆహారాన్ని ప్రజలకు అందించేందుకు కూడా ఇదొక్కటే మార్గమంటున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేరళా, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్ తదితర రాష్ర్టాల్లో దాదాపు 30 లక్షల మంది రైతులు ఈ వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తున్నారు. తన సేవలకు గాను.. 2005లో బసవ శ్రీ అవార్డు, శ్రీ మురుఘ మత్, చిత్రదుర్గ వంటి ప్రఖ్యాత అవార్డులను పొందారు. కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం భారత్ కృషి రత్న అవార్డును అందజేసింది. శ్రీ రామచంద్రపురమత, కర్ణాటక షిమోగ గోపాల్ గౌరవ్ అవార్డుతో సత్కరించింది.
om shanti
ReplyDeleteom shanti
ReplyDelete